పాదహస్తాసనంతో మరింత జీర్ణశక్తి

ఈ ఆసనంలో కాలిబొటన వేలి నుంచి, చీలమండ పాదాలను తాకుతాము. కాళ్ళు నిటారుగా ఉంచుతూ, ఉదరము పైభాగాన్ని వంచి చేతులతో పాదాలను తాకే ఈ స్థితి పాదహస్తాసన అని అంటారు.

ఆసన వేయు పద్దతి
మొదటగా చదునైన నెలపై నిటారుగా నిలబడాలి.
ఈ స్థితిలో కాళ్ళు ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉండాలి.
మెల్లగా గాలి పీల్చుకుంటూ తేతులను పైకి ఎత్తాలి.
భుజాలు చెవులను తాకుతూ ఉండేలా చూసుకోవాలి.
గాలి వదులుతూ ముందుకు వంగాలి.
ఈ ఆసనంలో సడుగుల నుంచి పాదాల వరకు నిటారుగా చక్కగా ఉండాలి.
ఇదే సమయంలో చేతులు పాదాలను తాకుతూ ఉండాలి.
తలను మోకాళ్ళుకు సాధ్యమైనంత దగ్గరగా తీసుకురావాలి.
ఇదే స్థితిలో 30 నుంచి 40 సెకనులు ఆగాలి.
ఇది సూర్య నమస్కారంలోని 3వ దశను తలపిస్తుంది.
మెల్లగా గాలి పీల్చుతూ ఈ స్థితి నుంచి బయటకు రావాలి.
మెల్లగా చేతలు, తలభాగాన్ని తిరిగి వెనక్కు తీసుకురావాలి.

WD
ఉపయోగాల
జీర్ణ సమస్యల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. నాడీమండాలానికి మంచి బలం చేకూరుతుంది. ఉదరభాగంలోని కండరాలని క్రమంలో ఉంచుతుంది. అంతర అవయవాలను, ప్రత్యేకించి జీర్ణావయవాలను ఉత్తేజపరుస్తుంది. ఫలితంగా అవి మరింత వేగంగా పని చేస్తాయి. నడుము నొప్పి నుంచి మంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది.వెన్నెముక సంబంధించిన వ్యాధులతో బాధపడే వారు ఈ ఆసనాన్ని వేయకపోవడమే మంచిది.

వెబ్దునియా పై చదవండి