జాతకం

మేషం
మేషరాశి: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం ఈ మాసం అనుకూలదాయకమే. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. సమర్థతను చాటుకుంటారు. పరిచయాలు బలపడుతాయి. సంతానం చదువులపై దృష్టి పెడతారు. విద్యాప్రకటనలను విశ్వసించవద్దు. ఆరోగ్యం సంతృప్తికరం. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. దంపతులకు కొత్త ఆలోచనలు స్పురిస్తాయి. విలువైన వస్తువులు జాగ్రత్త. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. అవివాహితులకు శుభవార్త శ్రవణం. వ్యాపారాభివృద్ధిక పథకాలు రూపొందిస్తారు. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. దైవ, వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. దంపతులకు కొత్త ఆలోచనలు స్పురిస్తాయి. విలువైన వస్తువులు జాగ్రత్త. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.