జాతకం

మేషం
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. అనాలోచిత నిర్ణయాలు తగవు. పెద్దలను సంప్రదించండి. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. గృహమార్పు నిదానంగా ఫలితం ఇస్తుంది. ఆర్థికంగా కుదుటపడతారు. రుణ సమస్యలకు తాత్కాలిక విముక్తి లభిస్తుంది. ఖర్చులు విపరీతం. అవసరాలు నెరవేరగలవు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. కుటుంబీకుల ప్రోత్సాహం లభిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. ఉపాధ్యాయులకు స్థానచలనం ఇబ్బంది కలిగిస్తుంది. అధికారులకు ధనప్రలోభం తగదు. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు.