జాతకం

మేషం
బంధువులతో సంబంధాలు బలపడతాయి. ఆరోగ్య భంగం, ప్రశాంతత లోపం, చికాకులు ఎదుర్కుంటారు. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత అవసరం. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. ఇతరుల గురించి చేసిన వ్యాఖ్యానాలు మీ ఉన్నతికి భంగం కలిగించవచ్చు. జాగ్రత్త వహించండి. అవకాశాలు అందినట్టే చేజారిపోతుంటాయి. కొత్త యత్నాలు మొదలెడతారు. స్త్రీలకు వస్త్రప్రాప్తి, ఆహ్వానాలు అందుతాయి. ఆదాయ వ్యయాల్లో అంచనాలు ఫలించవు. ఖర్చులు అధికం. అవసరాలు అతికష్టంమీద నెరవేరగలవు. వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. ఉద్యోగ బాధ్యతలపై శ్రద్ధ వహించాలి. అధికారుల ఆగ్రహావేశాలకు గురయ్యే ఆస్కారం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వృత్తి ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ప్రయాణం కలిసివస్తుంది. అమ్మవారిని ఈ రాశి వారు గులాబీపూలతో అమ్మవారిని పూజించిన శుభం, జయం.