జాతకం

మకరం
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. బాధ్యతలు పెరుగుతాయి. గృహం సందడిగా ఉంటుంది. పరిచయాలు బలపడుతాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఖర్చులు అధికం. ధనానికి ఇబ్బంది ఉండదు. ఆత్మీయులకు సాయం అందిస్తారు. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. స్థిరాస్తి కొనుగోలు దిశగా ఆలోచిస్తారు. ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. పనులు నిదానంగా సానుకూలమవుతాయి. ఉద్యోగ బాధ్యతల్లో మెళకువ వహించండి. శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. వ్యాపరాలు ఊపందుకుంటాయి. సంస్థల స్థాపనలకు అనుకూలం. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. అత్యుత్సాహనం ప్రదర్శించవద్దు. న్యాయ సంబంధిత వివాదాలు కొలిక్కి వస్తాయి.