జాతకం

మకరం
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు ఈ మాసం ఆశాజనకమే. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఆదాయం సంతృప్తికరం. ఆవసరాలు నెరవేరుతాయి. రుణ విమక్తులవుతారు. పరిచయాలు బలపడుతాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఆలయాలు, సేవా సంస్థలకు సాయం అందిస్తారు. కొన్ని పనులు మందకొడిగా పూర్తవుతాయి. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. ఆత్మీయులకు చక్కని సలహాలిస్తారు. పెట్టుబడులు, స్థిరాస్తి కొనుగోలుకు అనుకూలం. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. సంతానం దూకుడును అదుపు చేయండి. వృత్తి ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. దస్త్రం వేడుక ప్రశాంతంగా సాగుతుంది. కోర్టు వాయిదాలకు హాజరవుతారు.