జాతకం

మకరం
మకర రాశి : ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు. ఆర్థిక స్థితి నిరాశాజనకం. ఇతరులతో పోల్చుకుని నిరుత్సాహం చెందుతారు. అవకాశాలు చేజారిపోతాయి. యత్నాలు విరమించుకోవద్దు. ఖర్చులు అంచనాలను మించుతాయి. రాబడిపై దృష్టిపెడతారు. చెల్లింపుల్లో జాగ్రత్త. బంధువులతో విభేదాలు తలెత్తుతాయి. మీ గౌరవానికి భంగం కలిగే సూచనలున్నాయి. సంప్రదింపులు ఓ కొలిక్కి వస్తాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. మీ శ్రీమతి సలహా కలిసివస్తుంది. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. సంతానానికి విదేశీ విద్యావకాశం లభిస్తుంది. వేడుకలకు సన్నాహాలు చేస్తారు. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్య సేవలు అవసరం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. సరకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తుల సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రయాణం తలపెడతారు. వాహనం ఇతరులకు ఇవ్వొద్దు.