జాతకం

కుంభం
కుంభం ధనిష్ట 3,4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1,2,3 పాదాలు ఆదాయ వ్యయాలు ఫర్వాలేదనిపిస్తాయి. పన్నులు, ఇతర వాయిదాలు సకాలంలో చెల్లిస్తారు. భాగస్వామిక సమావేశాల్లో కొత్త అంశాలు చర్చకు వస్తాయి. వ్యాపారాల్లో నిలదొక్కుకోవటంతో పాటు అనుభవం గడిస్తారు. మీ పథకాలు, ప్రణాళికలు కార్యరూపం దాల్చుతాయి. ఆరోగ్య భంగం, సంతాన మూలక సమస్యలు మనస్థిమితం లేకుండా చేస్తాయి. ఓర్పు, రాజీ మార్గంలో మీ సమస్యలు పరిష్కరించుకోవాలి. ఒక శుభకార్యానికి తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. స్త్రీలకు అయిన వారి నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. ఉద్యోగస్తులు ఎంత శ్రమించినా గుర్తింపు అంతంత మాత్రంగానే ఉంటుంది. నిరుద్యోగులకు ఇంటర్వూలు నిరుత్సాహం కలిగిస్తాయి. ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమాధిక్యత, త్రిప్పట అధికం. ప్రేమికులు అతిగా వ్యవహరించడం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. వాహనం నిదానంగా నడపటం క్షేమదాయకం. కాంట్రాక్టర్లు, ఏజెంట్లకు రావలసిన బిల్లులు మంజూరు కాగలవు. కంప్యూటర్, అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం. తేనె, పంచామృతాలతో శివునికి అభిషేకం సర్వదా శుభదాయకం.