జాతకం

కుంభం
కుంభరాశి: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు ప్రేమానుబంధాలు బలపడుతాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. విలువైన వస్తువులు, నగదు జాగ్రత్త. సందేశాలను విశ్వసించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. పెట్టుబడులకు తరుణం కాదు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. పనులు సానుకూలమవుతాయి. వ్యవహారానుకూలత ఉంది. అంచనాలు ఫలిస్తాయి. నిర్దిష్ట ప్రణాళికలు రూపొందించుకుంటారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఆత్మీయులకు సాయం అందిస్తారు. గృహంలో సందడి నెలకొంటుంది. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు అనుకూలం. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తులకు ధన ప్రలోభం తగదు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దస్త్రం వేడుకను ఘనంగా చేస్తారు. చిరువ్యాపారులకు ఆదాయాభివృద్ధి.