జాతకం

కుంభం
కుంభరాశి: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు ఈ మాసం యోగదాయకమే. అంచనాలు ఫలిస్తాయి. ఖర్చులు అధికం, సంతృప్తికరం. సేవా సంస్థలకు విరాళిలిస్తారు. గౌరవం పెంపొందుతుంది. పరిచయాలు బలపడుతాయి. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. వాయిదా పడిన పనులు పూర్తి కాగలవు. సంతానం చదువులపై శ్రద్ధ అవసరం. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఆశ్చర్యకరమైన ఫలితాలెదురవుతాయి. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. పెట్టుబడి సమాచారం సేకరిస్తారు. మీ ప్రమేయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. వ్యాపారాల్లో పురోభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వాహనం ఇతరులకివ్వవద్దు. పందాలు, జూదాలకు దూరంగా ఉండాలి.