జాతకం

కుంభం
కుంభరాశి : ధనిష్ట 3, 4 పాదాలు. శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు. ఈ మాసం అనుకూలదాయకమే. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. పెట్టుబడులపై దృష్టిపెడతారు. శుభకార్యం నిశ్చయమవుతుంది. పనులు సానుకూలమవుతాయి. వ్యవరానుకూలత ఉంది. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. బంధుత్వాలు బలపడతాయి. ఆధ్యాత్మికతపట్ల ఆసక్తి కలుగుతుంది. సంతానానికి త్వరలో ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. దంపతులకు కొత్త కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. స్థిరాస్తి కొనుగోలుకు అనుకూలం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆకర్షణీయమైన పథకాలు రూపొందిస్తారు. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి.