జాతకం

కుంభం
ఈ మాసం అన్ని రంగాల వారికి అనుకూలమే. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఆశలొదిలేసుకున్న బాకీలు వసూలు కాగలవు. విలువైన వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. రశీదులు, పత్రాలు జాగ్రత్త. ప్రయత్న పూర్వకంగా అవకాశాలు కలిసివస్తాయి. ఎటువంటి సమస్యలనైనా నిబ్బరంగా ఎదుర్కుంటారు. వ్యాపారాల్లో స్వల్ప లాభాలు గడిస్తారు. భాగస్వామిక చర్చల్లో పురోగతి ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త. వైద్యుల సలహా పాటించండి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. సన్మానాలు, ప్రశంసలు అందుకుంటారు. ప్రకటనల పట్ల అవగాహన అవసరం. కలువపూలు, చామంతులతో అమ్మవారి అర్చన ఈ రాశివారికి కలసిరాగలదు.