జాతకం

మీనం
మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. వేడుకను ఘనంగా చేస్తారు. ఆరోగ్యం సంతృప్తికరం. సంతానం చదువులపై దృష్టి పెడతారు. గృహంలో సందడి నెలకొంటుంది. పెట్టుబడులకు అనుకూలం. వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు దిశగా యత్నాలు సాగిస్తారు. ప్రియతముల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సందేశాలను విశ్వసించవద్దు. ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. వృత్తి ఉపాధి పథకాల్లో రాణింపు, అనుభం గడిస్తారు. రవాణా రంగాలవారికి ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు.