జాతకం

మీనం
మీనరాశి : పూర్వాభాద్ర 4వ పాదం. ఉత్తరాభాద్ర, రేవతి ఆర్థికస్థితి మెరుగుపడుతుంది. బాకీలు వసూలవుతాయి. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. సమర్థతను చాటుకుంటారు. బాధ్యతలు అధికమవుతాయి. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. విలువైన వస్తువులు, పత్రాలు జాగ్రత్త. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. సంప్రదింపులకు అనుకూలం. వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. అవగాహనలేని విషయాల్లో జోక్యం తగదు. గృహమార్పు కలిసివస్తుంది. పరిచయాలు బలపడతాయి. సంతానం దూకుడు అదుపు చేయండి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. వృత్తుల వారికి సామాన్యం. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. సరకు నిల్వలో జాగ్రత్త. నిర్మాణాలు వేగవంతమవుతాయి. కొత్త ప్రదేశాలు, తీర్థయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు.