జాతకం

మీనం
బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆప్తులను విందులకు ఆహ్వానిస్తారు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. క్రయ, విక్రయాలు ఊపందుకుంటాయి. ఆకర్షణీయమైన పథకాలు రూపొందిస్తారు. భాగస్వామిక చర్చలు వాయిదా పడతాయి. బరువు బాధ్యతలు పెరుగుతాయి. ప్రతి విషయంలోను ఆచితూచి వ్యవహరించాలి. ఆదాయ వ్యయాలు అంచనాలకు భిన్నంగా ఉంటాయి. ఖర్చులు అధికం. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు ఒత్తిడి, పనిభారం, నిరుద్యోగులకు ఆశాజనకం. వృత్తి ఉపాధి పథకాలు అంతంతమాత్రంగా సాగుతాయి. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. సోదరుల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. ఈ రాశివారు మల్లె, జాజిపూలతో అమ్మవారిని పూజించిన శుభం, జయం.