జాతకం

వృషభం
వృషభరాశి: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. తొందరపాటు నిర్ణయాలు తగవు. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. ఖర్చులు విపరీతం. రాబడిపై దృష్టి పెడతారు. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. సభ్యత్వాలు, పదవులు దక్కకపోవచ్చు. ఆశావహ దృక్పథంతో యత్నాలు సాగించండి. ఆభరణాలు, పత్రాలు జాగ్రత్త. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. సన్నిహితులను వేడుకలకు ఆహ్వానిస్తారు. సంతానం దూకుడు అదుపు చేయండి. గృహ మార్పుచేర్పులకు అనుకూలం. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. వస్త్ర, పచారీ వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. అధికారులకు బాధ్యతల మార్పు, స్థానచలనం. దైవకార్యాల్లో ప్రముఖంగా పాల్గొంటారు.