జాతకం

వృషభం
వృషభరాశి: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. రావలసిన ధనం అందుతుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పరిస్థితుల అనుకూలత ఉంది. వ్యవహారాలు పురోగతిన సాగుతాయి. మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది. పనులు సానుకూలమవుతాయి. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. దైవకార్యంలో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు సమయపాలన ప్రధానం. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలు భర్తీ చేసుకుంటారు. దస్త్రం వేడుక ప్రశాంతంగా సాగుతుంది. ఆత్మీయుల యోగక్షేమాలు తెలుసుకుంటారు. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణం తగదు. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం.