జాతకం

వృషభం
వృషభరాశి: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు సమర్థతకు గుర్తింపు ఉండదు. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. గృహమార్పు అనివార్యం. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్యసేవలు అవసరం. ప్రియతములను కలుసుకుంటారు. కార్యసాధనకు ఓర్పు ప్రధానం. ఖర్చులు విపరీతం. ఆదాయంపై దృష్టి పెడతారు. సంతానం విజయం ఉత్సాహాన్నిస్తుంది. పరిచయాలు బలపడుతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. దళారులను విశ్వసించవద్దు. వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండాలి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. పందాలకు దూరంగా ఉండాలి.