జాతకం

వృషభం
వృషభరాశి : కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖర్చులు విపరీతం. సంప్రదింపులు ఫలిస్తాయి. పరిస్థితులు అనుకూలత ఉంది. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. మీ శ్రీమతి ఆరగ్యం ఆందోళన కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. సంతానం దూకుడు అదుపు చేయండి. పెద్దల ప్రమేయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. సరకు నిల్వలో జాగ్రత్త. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. గత అనుభవాలు అనుభూతినిస్తాయి. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.