జాతకం

వృషభం
ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. సహోద్యోగుల ప్రశంసలందుకుంటారు. పనుల సానుకూలతకు బాగా శ్రమించాలి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వస్త్ర, బంగారం వ్యాపారాలు ఊపందుకుంటాయి. వృత్తుల వారికి ఆశాజనకం. దైవకార్యాల్లో పాల్గొంటారు. ఆత్మీయుల క్షేమసమాచారాలు తెలుసుకుంటారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఖర్చులు పెరిగినా భారమనిపించవు. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. విలువైన వస్తువులు, పత్రాలు జాగ్రత్త. ఒక సంఘటన ఆలోచింపచేస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. సోదరుల మధ్య అవగాహన నెలకొంటుంది. స్థిరాస్తి అభివృద్ధి దిశగా ఆలోచనలుంటాయి. ప్రయాణంలో అప్రమత్తంగా ఉండాలి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. స్త్రీలకు వాహనయోగం, వస్త్ర ప్రాప్తి. ఈ రాశి వారు అమ్మవారిని జాజి పూలతో పూజించిన కలిసిరాగలదు.