జాతకం

వృషభం
వృషభరాశి :కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు. పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. గృహంలో సందడి నెలకొంటుంది. ఖర్చులు అంచనాలు మించుతాయి. అవసరాలకు ధనం సర్దుబాటవుతుంది. వివాహ యత్నాలు చూసుకోవాలి. వ్యవహారనుకూలత ఉంది. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. నగదు, వస్తువులు జాగ్రత్త. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. వ్యవహారానుకూలత ఉంది. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. నిర్మాణాలు, మరమ్మతులు చేపడుతారు. సంతానం విజయంతో సంతోషానిస్తుంది. ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. అధికారులకు ధనప్రలోభం తగదు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వేడుకలు, దైవకార్య సమావేశాల్లో పాల్గొంటారు.