జాతకం

మిథునం
మిధునరాశి: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ఒక సంబంధం ఆలోచింపచేస్తుంది. సంతానం ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. గృహంలో మార్పు చేర్పులకు అనుకూలం. ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు సామాన్యం. రుణ సమస్యలు పరిష్కారమవుతాయి. మానసికంగా కుదుటపడుతారు. పనులు వేగవంతమవుతాయి. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. ఆలయాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యాపారాల్లో పురోభివృద్ధి, అనుభవం గడిస్తారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉపాధ్యాయులకు శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కళాకారులకు ఆదరణ లభిస్తుంది. ప్రయాణంలో అవస్థలెదుర్కుంటారు.