జాతకం

మిథునం
మిథున రాశి : మృగశిర 3, 4 పాదాలు. ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు. ఈ మాసం ప్రథమార్థం ఆశాజనకం. కొత్త యత్నాలకు శ్రీకారం చుడుతారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఆర్థిక సమస్యలు ఓ కొలిక్కివస్తాయి. ఖర్చులు అధికం. ధనానికి ఇబ్బంది ఉండదు. అవకాశాలు చేజారిపోతాయి. సంప్రదింపులకు అనుకూలం. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. మొహమ్మాటాలు, ఒత్తిళ్ళకు పోవద్దు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. దంపతుల మధ్య అవగాహన లోపం. సంతానానికి నిదానంగా ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. గృహమార్పు అనివార్యం. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులను ధీటుగా ఎదుర్కొంటారు. మీ పథకాలు మున్ముందు ఫలితాలనిస్తాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. కోర్టు వాయిదాలు చికాకుపరుస్తాయి.