జాతకం

మిథునం
పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. ప్రత్యర్థులతో జాగ్రత్త. దుబారా ఖర్చలు అధికం. చేతిలో ధనం నిలబడదు. ఆత్మీయులను వేడుకలు, విందులకు ఆహ్వానిస్తారు. మీ ప్రమేయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. ఆర్థికలావాదేవీలు, వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాభివృద్ధికి ఆకర్షణీయమైన పథకాలు రూపొందిస్తారు. వృత్తుల వారికి ప్రజా సంబంధాలు బలపడతాయి. ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రశంసలందుకుంటారు. ఉద్యోగ యత్నం ఫలిస్తుంది. అధికారులకు హోదా మార్పు, స్థానచలనం, శుభకార్య యత్నాలకు శ్రీకారం చుదతారు. కళ, క్రీడ, సాంకేతిక రంగాల వారికి ప్రోత్సాహకరం. ఈ రాశివారు అమ్మవారిని జాజి పూలతో పూజించిన అన్ని విధాలా శుభదాయకం.