జాతకం

కర్కాటకం
కర్కాటకరాశి: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష ఆర్థికస్థితి సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. అపరిచితులతో మితంగా సంభాషించండి. ఆర్థిక విషయాలు వెల్లడించవద్దు. సంతానం చదువుల పట్ల శ్రద్ధ అవసరం. విమర్శలు, అభియోగాలు ఎదుర్కుంటారు. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. గుట్టుగా యత్నాలు సాగించండి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఆరోగ్యం సంతృప్తికరం. ఆలయాలు, సేవా సంస్థలకు సాయం అందిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఉన్నతికి తోడ్పడుతాయి. అధికారులకు ధనప్రలోభం తగదు. ఉద్యోగస్తులకు పదోన్నతి. ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పెట్టుబడులకు అనుకూలం.