జాతకం

కర్కాటకం
కర్కాటకరాశి: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష వ్యవహారానుకూలత ఉంది. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడుతారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. మనోధైర్యంతో వ్యవహరిస్తారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వాగ్ధాటితో ఆకట్టుకుంటారు. పనులు సానుకూలమవుతాయి. ఆందోళన కలిగించిన సమస్య సర్దుమణుగుతుంది. ఖర్చులు అదుపులో ఉండవు. రాబడిపై దృష్టి పెడతారు. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. ఆరోగ్యం జాగ్రత్త. వ్యాపారాలు ఊపందుకుంటాయి. దస్త్రం వేడుకను ఘనంగా చేస్తారు. చిరువ్యాపారులకు ఆదాయాభివృద్ధి. వైద్య, న్యాయ వారికి ఆశాజనకం. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.