జాతకం

కర్కాటకం
కర్కాటకరాశి: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష సర్వత్రా అనుకూలతలున్నాయి. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. వాగ్ధాటితో రాణిస్తారు. పనులు వేగవంతమవుతాయి. ఆరోగ్యం సంతృప్తికరం. ధనలాభం ఉంది. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. రశీదులు, పత్రాలు జాగ్రత్త. సందేశాలను విశ్వసించవద్దు. ఆర్థిక వివరాలు వెల్లడించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. దాంపత్య సౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. పెద్దల ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగిస్తారు. గృహం సందడిగా ఉంటుంది. బంధుత్వాలు, పరిచయాలు బలపడుతాయి. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. చిరువ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు స్థానచలనం. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు.