జాతకం

కర్కాటకం
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష ప్రేమానుబంధాలు బలపడతాయి. సమర్థతకు గుర్తింపు ఆలస్యంగా లభిస్తుంది. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే. త్వరలో శుభవార్త వింటారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. వేడుకలకు హాజరవుతారు. బంధువుల ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. ఆర్థికంగా కుదుటపడతారు. పొదుపు ధనం అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. ధనానికి ఇబ్బంది ఉండదు. గృహంలో స్తబ్ధత తొలగుతుంది. సంతానం దూకుడు అదుపు చేయండి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు అనుకూలం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. మీ పథకాలు సత్ఫలితాలిస్తాయి. సేవ, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ప్రముఖులకు అభినందనలు తెలియజేస్తారు. ప్రయాణంలో చికాకులు తప్పవు.