జాతకం

కర్కాటకం
నిర్దిష్ట ప్రణాళికలతో యత్నాలు సాగిస్తారు. పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. ఖర్చులు అధికం. చేతిలో ధనం నిలబడదు. అవసరాలు, చెల్లింపులు వియిదా వేసుకుంటారు. కీలక వ్యవహారాలపై పట్టు సాధిస్తారు. సంప్రదింపులు కొలిక్కి వస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. బంధుమిత్రులతో అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. గత తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్త వహించండి. హామీలు, మద్య వర్తిత్వాలకు దూరంగా ఉండాలి. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వస్త్ర, ఫ్యాన్సీ, బంగారం వ్యాపారాలు ఊపందుకుంటాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ప్రయాణం చేయవలసి వస్తుంది. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. సంకల్ప సిద్ధి, ప్రశాంతతకు అమ్మవారిని పున్నాగ పూలతో పూజించండి.