జాతకం

సింహం
సింహ రాశి : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. కార్యసాధనకు ఓర్పు, పట్టుదల ప్రధానం. సమర్థతకు ఏమంత గుర్తింపు లభించదు. కొత్త సమస్యలెదురయ్యే సూచనలున్నాయి. అప్రమత్తంగా వ్యవహరించాలి. పెద్దల సలహా పాటించండి. ఖర్చులు విపరీతం. రాబడిపై దృష్టిపెడతారు. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. దళారులను విశ్వసించవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. విలువైన వస్తువులు, నగదు పట్ల జాగ్రత్త. గృహమార్పు కలిసివస్తుంది. ఆశావహదృక్పథంతో ఉద్యోగయత్నం సాగించండి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు ధనప్రలోభం తగదు. వృత్తి ఉపాధి పథకాల సామాన్యంగా సాగుతాయి. వ్యాపారాభివృద్ధికి మరింతగా శ్రమించాలి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ప్రయాణం తలపెడతారు.