జాతకం

సింహం
ఈ మాసం యోగదాయకమే. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సంప్రదింపులు, కొలిక్కి వస్తాయి. ముఖ్యమైన పత్రాలు, నగదు జాగ్రత్త. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. దంపతుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. స్త్రీలకు వస్త్ర ప్రాప్తి, వాహనయోగం, సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహిస్తారు. ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన పెట్టుబడులు, పొదుపు పథకాలకు అనుకూలం. స్థిరాస్తి కొనుగోలు దిశగా ఆలోచనలుంటాయి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. అధికారులకు కింది స్థాయి సిబ్బందితో చికాకులు తలెత్తుతాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అమ్మవారికి ఎర్రని పూలు, గులాబీలతో అర్చన ఈ రాశివారికి కలిసిరాగలదు.