జాతకం

సింహం
సింహం రాశి : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. ఈ మాసం శుభాశుభాల మిశ్రమ. ఖర్చులు అంచనాలను మించుతాయి. రాబడిపై దృష్టిపెడతారు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. వ్యవహారాల్లో మెలకువ వహించండి. అనాలోచిత నిర్ణయాలు తగవు. ఆత్మీయుల సలహా పాటించండి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. అవకాశాలు తక్షణం వినియోగించుకోండి. సమర్థతకు ఏమంత గుర్తింపు ఉండదు. పదవుల నుంచి తప్పుకుంటారు. సంతానం భవిష్యత్తుపై దృష్టిపెడతారు. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలు, ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. ఉపాధ్యాయులకు పురస్కార యోగం. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. అధికారుల ఒత్తిడి, విశ్రాంతి లోపం. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు.