జాతకం

కన్య
కన్యరాశి: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఉన్నత పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. ఆదాయ వ్యయాలు ఫర్వాలేదనిపిస్తాయి. పొదుపు ధనం అందుతుంది. పెద్దమొత్తం ధనసహాయం తగదు. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనులు ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. శకునాలను పట్టించుకోవద్దు. వేడుకను ఘనంగా చేస్తారు. మీ ఆతిధ్యం ఆకట్టుకుంటుంది. స్థిరాస్తి కొనుగోలు దిశగా ఆలోచిస్తారు. సంతానం పై చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలిస్తాయి. నూతన పెట్టుబడులకు అనుకూలం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. దైవదర్శనాలు సంతృప్తినిస్తాయి. ఆత్మీయుల యోగక్షేమాలు తెలుసుకుంటారు.