జాతకం

కన్య
కన్యరాశి: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. వేడుకలు, విందుల్లో పాల్గొంటారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. రుణ విముక్తులవుతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. పరిచయం లేని వారితో మితంగా సంభాషించండి. దంపతులకు కొత్త ఆలోచనలు స్పురిస్తాయి. సంతానం ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. ఆరోగ్యం మందగిస్తుంది. విశ్రాంతి అవసరం. పెట్టుబడులపై దృష్టి పెడతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. విదేశీయానం, తీర్థయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు.