జాతకం

కన్య
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. అవసరాలకు ధనం అందుతుంది. పనుల సానుకూలతకు ఓర్పు ప్రధానం. అవకాశాలు అందినట్టే చేజారిపోతాయి. యత్నాలను విరమించుకోవద్దు. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. గృహం ప్రశాంతంగా వుంటాయి. అవివాహితులకు శుభవార్తా శ్రవణం. గృహమార్పు కలిసివస్తుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. దంపతుల మధ్య దాపరికం తగదు. ఆరోగ్యం మందగిస్తుంది. విశ్రాంతి అవసరం. పూర్వ విద్యార్థులను కలుసుకుంటారు. వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. ఉద్యోగయత్నంలో నిరుత్సాహం తగదు. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు.