జాతకం

కన్య
వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆకర్షణీయమైన పథకాలు రూపొందిస్తారు. ఉద్యోగయత్నం ఫలిస్తుంది. అధికారులకు ధన ప్రలోభం తగదు. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలు, వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. బాకీలు, ఇతరత్రా రావలసిన ఆదాయం అందుతుంది. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పనుల సానుకూలతకు బాగా శ్రమించాలి. ఆత్మీయులను దైవకార్యాలు, విందులకు ఆహ్వానిస్తారు. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్యసేవలు అవసరమవుతాయి. క్రీడ, కళా, సాంకేతిక రంగాల వారికి ప్రోత్సాహకరం. ప్రయాణం తలపెడతారు. ఈ రాశి వారికి దేవగన్నేరు పూలతో అమ్మవారి అర్చన శుభం, జయం.