జాతకం

తుల
తులారాశి: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు ఈ మాసం అనుకూల ప్రతికూలతల సమ్మేళనం. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ధనమూలక సమస్యలెదురవుతాయి. సాయం చేసేందుకు అయిన వారే వెనుకాడుతారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడుతాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. సంతానం చదువులపై దృష్టి పెడతారు. ప్రకటనలు, మధ్యవర్తులను విశ్వసించవద్దు. ఉద్యోగ బాధ్యతల్లో మెళకువ వహించండి. కొత్త అధికారులతో సమస్యలెదురవుతాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. దస్త్రం వేడుకలు ప్రశాంతంగా సాగుతుంది. సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి.