జాతకం

తుల
తుల: చిత్త 3, 4 పాదాలు. స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు. ఖర్చులు అధికం. పొదుపు ధనం అందుకుంటారు. పనులు వేగవంతమవుతాయి. దంపతుల అవగాహన లోపం. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. అనునయంగా మెలగాలి. ఇంటి విషయాల పట్ల శ్రద్ధ అవసరం. సంప్రదింపులు కొలిక్కి వస్తాయి. ఒప్పందాలు కుదుర్చుకుంటారు. సమస్యలు సర్దుకుంటాయి. మానసికంగా కుదుటపడతారు. బాధ్యతలు అధికమవుతాయి. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రియతములను కలుసుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి. ఉపాధి శిక్షణావకాశం లభిస్తుంది. విదేశీ విద్యాయత్నం ఫలించదు. వ్యాపారాల్లో ఆటంకాలు తొలగుతాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. ఆధ్యాత్మిక పట్ల ఆసక్తి కలుగుతుంది.