జాతకం

తుల
కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. తొందరపాటు నిర్ణయాలు సమస్యలకు దారితీస్తాయి. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు, ఒత్తిడి, పనిభారం అధికం. నిరుద్యోగులు ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఆదాయానికి తగ్గట్టు ఖర్చులుంటాయి. పొదుపు చేయాలన్న ఆలోచన ఫలించదు. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. స్త్రీలకు వస్త్ర ప్రాప్తి, వస్తులాభం, వాహనయోగం. ఉపాధి పథకాల్లో రాణిస్తారు. వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. విద్యార్థులకు అత్యుత్సాహం తగదు. ఉపాధ్యాయుల కృషికి గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారాల్లో నష్టాలు, ఆటంకాలు తొలగుతాయి. భాగస్వామిక చర్చల్లో పురోగతి ఉంటుంది. వాహన చోదకులకు కొత్త చికాకులెదురవుతాయి. ఈ రాశివారు అమ్మవారిని నందివర్ధన, చామంతులతో అమ్మవారిని పూజించిన సంకల్ప సిద్ధి, ప్రశాంతత చేకూరుతాయి.