జాతకం

తుల
తులారాశి : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు. ఈ మాసం, ప్రథమార్థం శుభదాయకం. సమస్యలకు తాత్కాలిక పరిష్కారం లభిస్తుంది. ఖర్చులు సామాన్యం. కొత్త పనులకు శ్రీకారం చుడుతారు. అవకాశాలు కలిసివస్తాయి. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. ఆదాయం సంతృప్తికరం. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. దళారులను విశ్వసించవద్దు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆభరణాలు, పత్రాలు, జాగ్రత్త. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. దంపతుల మధ్య అవగాహనా లోపం. సౌమ్యంగా మెలగాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. నిర్మాణాలు ఊపందుకుంటాయి. ఉపాధ్యాయులకు శుభయోగం. ప్రశంసలు, పురస్కారాలు అందుకుంటారు. పట్టుదలతో ఉద్యోగయత్నం సాగించడి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఆస్తి వివాదాలు కొత్త మలుపు తిరుగుతాయి. దైవ కార్యంలో పాల్గొంటారు.