జాతకం

వృశ్చికం
విశాఖ 4వ పాదం. అనురాధ, జ్యేష్ట కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. గృహమార్పు అనివార్యం. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. మొహమ్మాటాలు, భేషజాలకు పోవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. దీర్ఘకాలిక సమస్యలు కొలిక్కి వస్తాయి. మానసికంగా కుదుటపడుతారు. ధనలాభం ఉంది. ఖర్చులు విపరీతం. అవసరాలు నెరవేరుతాయి. సంతానం రాక ఉత్సాహాన్నిస్తుంది. పదవులు కోసం యత్నాలు సాగిస్తారు. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిన్ననాటి ఉపాధ్యాయులు తారసపడుతారు. గత అనుభవాలు జ్ఞప్తికొస్తాయి. వ్యాపారాల్లో లాభాలు, అనుభవం గడిస్తారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు.