జాతకం

వృశ్చికం
వృశ్చికరాశి: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట అన్ని రంగాల వారికి శుభదాయకమే. అనూకూల పరిస్థితులున్నాయి. వాగ్ధిటితో నెట్టుకొస్తారు. వ్యవహారజయం, వస్త్రప్రాప్తి, వాహనయోగం ఉన్నాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడుతాయి. ఆదాయం సంతృప్తికరం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. వ్యవహారానుకూలత ఉంది. సంతానం భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు బాధ్యతల మార్పు, పనిభారం. సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ప్రయాణ లక్ష్యం నెరవేరుతుంది.