జాతకం

వృశ్చికం
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట ఈ మాసం శుభాశుభాల మిశ్రమం. బాధ్యతగా వ్యవహరించాలి. యత్నాలు కొనసాగించండి. పరిస్థితులు నిదానంగా అనుకూలిస్తాయి. గృహమార్పు అనివార్యం. ఆదాయానికి మించి ఖర్చులు, రుణ ఒత్తిళ్లు ఎదుర్కొంటారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆత్మీయుల సాయం అందుతుంది. ఒక సమస్య నుంచి బయటపడతారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సాగవు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. సంతానం ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. విద్యా ప్రకటనలను విశ్వసించవద్దు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు హోదా మార్పు, స్థానచలనం. వృత్తి ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు. కోర్టు వాయిదాలకు హాజరవుతారు.