జాతకం

వృశ్చికం
వృశ్చికరాశి : విశాఖ 4వ పాదం, అనూరాధ్య, జ్యేష్ట వివాహయత్నం ఫలిస్తుంది. స్తోమతకు మించి హామీలివ్వవద్దు. పెద్దల సలహా పాటించండి. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. పరిచయాలు బలపడతాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. రుణ ఒత్తిళ్లు అధికం. సన్నిహితుల సాయం అందుకుంది. స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన అవసరం. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు అభ్యంతరాలెదురవుతాయి. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. సరకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు ఒత్తిడి, విశ్రాంతి లోపం. వేడుకల్లో అత్యుత్సాహం తగదు.