జాతకం

ధనస్సు
మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం ఈ మాసం ఫర్వాలేదనిపిస్తుంది. కొన్ని ఇబ్బందులు తొలుగుతాయి. మానసికంగా కుదుటపడుతారు. ఊహించని ఖర్చులుంటాయి. ధనం మితంగా వ్యయం చేయండి. సహాయం చేసేందుకు అయిన వారే సందేహిస్తారు. పెట్టుబడులకు అనుకూలం కాదు. వేడుకలకు యత్నాలు సాగిస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ప్రియతములో ఉల్లాసంగా గడుపుతారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. సంతానం రాక ఉత్సాహాన్నిస్తుంది. పూర్వ విద్యార్థులను కలుసుకుంటారు. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో మెళకువ వహించండి. వివరణ ఇచ్చుకోవలసిన పరిస్థితులెదరవుతాయి. వ్యాపారాల్లో నష్టాలను భర్తీ చేసుకుంటారు. చిరువ్యాపారులకు పురోభివృద్ధి. పందాలు, పోటీలు ఉల్లాసాన్నిస్తాయి. ప్రయాణం, దైవదర్శనాల్లో అవస్థలు తప్పవు.