జాతకం

ధనస్సు
ధనర్‌రాశి: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం వ్యవహారాల్లో ప్రతికూలతలెదుర్కుంటారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. ధనం మితంగా వ్యయం చేయాలి. సన్నిహితుల సాయం అందుతుంది. మానసికంగా కుదుటపడుతారు. పనుల్లో ఆటంకాలు, ఒత్తిడి అధికం. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. విశ్రాంతి అవసరం. దంపతుల మధ్య దాపరికం తగదు. బంధువులతో అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. ఈ ఇబ్బందులు, చికాకులు తాత్కాలికమే. త్వరలో పరిస్థితులు చక్కబడుతాయి. యత్నాలు విరమించుకోవద్దు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే అనుకూలం. పెట్టుబడుల విషయంలో పునరాలోచన మంచిది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తుల సమర్థత అధికారులకే లాభిస్తుంది.