జాతకం

ధనస్సు
ధనర్ రాశి: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం శుభ కార్యానికి సన్నాహాలు సాగిస్తారు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. కార్యసాధనకు మరింత శ్రమించాలి. మీ సమర్థత మరొకరికి కలిసివస్తుంది. వ్యవహారం బెడిసికొట్టే ఆస్కారం ఉంది. పెద్దల సలహా పాటించండి. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. ఆదాయం సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. చెల్లింపుల్లో జాగ్రత్త. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. దంపతులకు కొత్త ఆలోచనలు స్పురిస్తాయి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. మీ సహాయంతో ఒకరికి సదావకాశం లభిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నష్టాలు భర్తీ చేసుకుంటారు. కార్మికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు.