జాతకం

ధనస్సు
ధనుర్ రాశి : మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం. వ్యవహారాలకు సమర్థంగా నిర్వహిస్తారు. మీ సలహా ఎదుటివారికి కలిసివస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. పెట్టుబడులకు తరుణం కాదు. కష్టం ఫలిస్తుంది. ఆదాయం సంతృప్తికరం. రుణ వాయిదాలు చెల్లిస్తారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంభవం. పనులు సానుకూలమవుతాయి. అనవసర జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం వాటిల్లకుండా మెలగాలి. సంతానం అత్యుత్సాహం ఇబ్బంది కలిగిస్తుంది. నిర్మాణాలు, మరమ్మతులు చురుగా సాగుతాయి. ఉపాధ్యాయులకు సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. అధికారులకు ధనప్రలోభం తగదు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. క్రయ విక్రయాలు ఊపందుకుంటాయి. తీర్థయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు. ప్రయాణం కలిసివస్తుంది.