ఈ నేపథ్యంలో వరద బాధితులను ఆదుకునేందుకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు ముందుకు వస్తున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ బోర్డు సభ్యుడు పిఎంఎస్ ప్రసాద్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన మెంటార్-రిలయన్స్ గ్రూప్ పివిఎల్ మాధవరావులు కలిసి సీఎం రేవంత్ రెడ్డికి రూ.20 కోట్ల చెక్కును అందించారు.