నేడు టి-20లో రెండో పోరు.. సిద్ధమవుతున్న భారత్, దక్షిణాఫ్రికా

సోమవారం, 5 అక్టోబరు 2015 (07:19 IST)
గాంధీ-మండేలా టి-20సీరీస్‌లో రెండో మ్యాచ్‌కు సిద్ధమయ్యాయి. నేడు కటక్‌లో ఈ మ్యాచ్ జరుగనున్నది. భారత్, దక్షిణాఫ్రికా దేశాలు రెండు సిద్ధమయ్యాయి. దక్షిణాఫ్రికాతో మ్యాచ్ అనేది అంత సులువు కాదనే విషయం ఇండియాకు అర్థమయిపోయింది. జోరు పెంచకపోతే సొంత గడ్డపైనే పరువు పోతుందనే భయం ఇండియాకు పట్టుకుంది. అయితే రెండో మ్యాచ్‌లో కూడా విజయం సాధించి ఆదిలోనే ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని దక్షిణాఫ్రికా ఉవ్విళ్ళూరుతోంది. 
 
బ్యాట్స్‌మెన్‌ రాణించినా బౌలర్లు విఫలం కావడంతో తొలి మ్యాచ్‌లో జరిగిన తప్పులను రెండో మ్యాచ్‌లో జరుగకుండా చూసుకోవాలని ఇండియా తొలి టీ20లో పేసర్లు ఆరంభంలో ప్రత్యర్థి ఓపెనర్లపై ఒత్తిడి తేలేకపోయారు. ఆ తప్పు ఈ పర్యాయం జరుగకుండా చూసుకునేందుకు ఫేసర్లకు నూరిపోస్తున్నారు. తొలి మ్యాచ్‌లో ఒకే ఓవర్లో వరుసగా మూడు సిక్సర్లు ఇచ్చి మ్యాచ్‌ సఫారీల వైపు మొగ్గడానికి కారకుడైన స్పిన్నర్‌ అక్షర్‌పటేల్‌కు ఈ మ్యాచ్‌లో చోటు దక్కడం అనుమానమే. టి-20 ఏకంగా ఒకే ఓవర్లో 3 సిక్సిర్లు బాదే అవకాశం ఇవ్వడం కొంప ముంచేస్తుందని జట్టు భావిస్తోంది. అందుకే అతని స్థానంలో మరో లెగ్ స్పిన్నర్‌ను తీసుకునే అవకాశం ఉంది. 
 
భారత్‌పై ఒత్తిడి పెరుగింది. స్వదేశంలో అందునా టి20లో ఓడిపోతే ఇక తలెత్తుకు తిరగలేని స్థితి నెలకొనడం ఖాయమని భావన పెరుగుతోంది. ఇలాంటి పిరస్థితులలో ఇవ్వాళ రెండు దేశాల జట్లు టి-20లో రెండో పోరుకు సిద్ధమవుతున్నాయి. 

వెబ్దునియా పై చదవండి